స్వాతంత్ర సమరయోధుడు వీరయ్య హఠాన్మరణం..

by Sumithra |
స్వాతంత్ర సమరయోధుడు వీరయ్య హఠాన్మరణం..
X

దిశ, వైరా : మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మట్టూరి వీరయ్య (88) బుధవారం హఠాన్మరణం చెందారు. కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న వీరయ్య హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వీరయ్య గతంలో కల్లూరులోని కాకతీయ చక్కెర కర్మాగారం పరిధిలో చెరుకు రైతులు అభివృద్ధి కమిటీ చైర్మన్, సిరిపురం పంచాయతీలో రెండుసార్లు దాదాపు 15 సంవత్సరాలకు పైగా సర్పంచ్ గా పనిచేశారు.

2001లో అయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా వైరా జడ్పీటీసీకి పోటీచేసి ఓడిపోయారు. ఆవెంటనే తిరిగి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరికి అత్యంతసన్నిహితుడిగా ఆయన కొనసాగుతున్నారు. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వైరా ప్రాంతంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా చెలామణి అవుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Next Story