- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వస్త్ర దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం
దిశ, వైరా : వైరాలోని పాత బస్టాండ్‌లో జాతీయ రహదారికి పక్కనే ఉన్న మిట్టపల్లి శ్రీనివాసరావు క్లాత్ షోరూంలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ వస్త్ర దుకాణం నుంచి బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో పొగలు వ్యాపించడాన్ని వాకింగ్ కి వెళ్లి వచ్చేవారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వైరా అగ్నిమాపక సిబ్బంది వెంటనే అగ్ని ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని నూతన వస్త్రాలతో పాటు ఇతర సామాగ్రి కాలిపోయాయి. ఈ దుకాణంలోని సీలింగ్ పై భాగంలో ఉన్న లైట్లు వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. సీలింగ్ పై భాగంలో ప్రారంభమైన మంటలు దుకాణం మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.