- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకేం కావాలో KTRకి తెలుసు.. పార్టీ మార్పుపై 'దిశ'కు వెల్లడించిన Pongulati Srinivas Reddy
దిశ, ఖమ్మం బ్యూరో: ప్రస్తుతం పార్టీలన్నీ ఖమ్మం వైపే చూస్తున్నాయి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలన్నీ ఇప్పుడు ఆయన చూట్టూరే తిరుగుతున్నాయి. రాష్ట్ర నేతల ఫోకస్ అంతా ఇప్పుడు ఆ నాయకుడిపైనే.. ఆయనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో హాట్ టాపిక్.. ఆయన ఎప్పుడు పార్టీ మారబోతున్నారు..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనే చర్చ రాష్ట్రవాప్తంగా కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో 'దిశ ప్రతినిధి'కి పొంగులేటి శనివారం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఏ పార్టీలో చేరుతానన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మార్చిలో క్లారిటీ వస్తుందని వెల్లడించారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోబోనని, అన్ని ఆలోచించాకే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
తొందరపడి నిర్ణయం తీసుకోను..
పొంగులేటి బీజేపీలో చేరుతున్నాడని, లేదా కాంగ్రెస్ లో చేరుతున్నాడని చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయని అన్న శ్రీనివాసరెడ్డి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశారు. ఏ పార్టీ అన్నదానిపై కూడా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. వైసీపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం తనను సంప్రదిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకునేసరికి రెండున్నర సంవత్సరాలు పట్టిందన్నారు. సంక్షోభం లేని సమయంలోనే అంత టైం తీసుకుంటే ఈ పరిస్థితుల్లో అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోవడం కుదరదన్నారు. జాతీయ పార్టీలు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని ఇంకా తన అభిప్రాయాన్ని మాత్రం ఎవ్వరికీ వెల్లడించలేదని చెప్పారు.
బీఆర్ఎస్ లో ఆత్మాభిమానం దెబ్బతిన్నది..
పార్టీ కోసం మొదటినుంచి ఎంతో కష్టపడ్డానని.. చివరికి పదవులు కూడా వదులుకున్నానని పొంగులేటి చెప్పుకొచ్చారు.. అయినా బీఆర్ఎస్ పార్టీలో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదన్నారు. పార్టీలో ఉండాలని ఎంపీ నామా నాగేశ్వరావు తనను కోరినట్లు చెప్పారు. పదవుల కోసం, వ్యాపారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల ఆశీస్సులు, దీవెనలతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను ఒక్కడినే ఒంటరిపోరు చేస్తున్నానని, తనపై అనేకమంది దండయాత్ర చేసే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకుని అందరినీ సంప్రదిస్తున్నానని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సంప్రదిస్తే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని అందరి నిర్ణయం మేరకు ఆలోచన చేస్తానంటూ చెప్పుకొచ్చారు.
నాకేం కావాలో కేటీఆర్ కు తెలుసు..
పార్టీ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏమైనా సంప్రదించిందా అన్న ప్రశ్నకు కూడా స్పందించిన పొంగులేటి తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. బహిరంగ సభ విషయం కూడా తనకు తెలియది చెప్పుకొచ్చారు. ఒకవేళ బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ సంప్రదిస్తే అని అడగ్గా.. తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తనకేం కావాలో కేటీఆర్ కు తెలుసని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీలోనే ఉండాలని నామా తనను కోరారని చెప్పారు. ఏది ఏమైనా భవిష్యత్తులో అందరి నిర్ణయం మేరకే నిర్ణయం ఉంటుందని, ఏ పార్టీలో చేరుతాననే విషయం కూడా మార్చిలోనే తెలుస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి : నాకేం కావాలో KTRకి తెలుసు.. పార్టీ మార్పుపై 'దిశ'కు వెల్లడించిన పొంగులేటి