మధిరలో కాంగ్రెస్‌కు షాక్.. మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో కీలక నేతలు

by Disha News Desk |
మధిరలో కాంగ్రెస్‌కు షాక్.. మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో కీలక నేతలు
X

దిశ, ఖమ్మం: మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం, ఖానాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. గ్రామ సర్పంచ్ మాలోజి ఉషా, భర్త మాలోజి గోవిందు, మాజీ సర్పంచ్ ఉయ్యాల సాంబయ్య , మాజీ ఎంపీటీసీ కామాల వెంకటేశ్వర్లు , వార్డు సభ్యులు తలారి మదారమ్మ , జాలాది తిరుపమ్మ , కొత్తపల్లి రాణి , యలమద్ధి రవి తో సహా 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఖమ్మం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్, పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు నేతృత్వంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులై వారంతా పార్టీలో చేరినట్లు తెలిపారు.

ముఖ్యంగా గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం. అందులో భాగంగా వైకుంఠదామాలు, డంపింగ్ యార్డు, పెన్షన్ సకాలంలో అందించడం, రైతు బంధు, రైతు బీమా, లాంటి మరెన్నో సంక్షేమ కార్యక్రమాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, రైతుల కష్టాలు తొలగి వారి కుటుంబాల్లో వెలుగులు నిండాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Advertisement

Next Story