- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలేరు నుంచి పోటీ...రాజన్న రాజ్యమే లక్ష్యం : YS Sharmila
దిశ, ఖమ్మం రూరల్ : వైఎస్ఆర్ సంక్షేమం కోసం పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని, పాలేరు ప్రజల ఆశయాలు సాధిస్తానని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం రూరల్ మండలం కరుణగిరి బైపాస్ నందు గల కేంద్రీయ విద్యాలయం సమీపంలో వైఎస్ఆర్టీపీ పాలేరు క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి, ఆయన సంక్షేమ పాలన గురించి ప్రజలు తెలుసునని, అదే తరహా పాలన పాలేరు నుంచి ప్రారంభం కాబోతుందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర్రెడ్డి కే దక్కుతుందన్నారు. పాలేరు ప్రజలకు మళ్లీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపనని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్తు ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు వైఎస్ఆర్ అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఐదేళ్లలోనే 46 లక్షల మంది పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారని, ఒక్క పాలేరులో 20 వేల ఇండ్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్దేనని కొనియాడారు. సీఎం కేసీఆర్ వెయ్యి ఇండ్లు అయినా ఇచ్చారా.. అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు, అసైన్డ్ భూములకు హక్కులు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయాంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు సబ్సిడీ ఇస్తే ఎంతో మంది లబ్దిపొందారని, ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కేసీఆర్ ఉన్న సబ్సిడీ కూడా ఎత్తేస్తే ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిందన్నారు.
భూమి పూజ ఉజ్వల భవిష్యత్తుకు నాంది : వైఎస్ విజయమ్మ
పాలేరులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరో ముందడుగు వేసిందని, ఈ భూమి పూజ ఉజ్వల భవిష్యత్తుకు నాంది అని వైఎస్ విజయమ్మ అన్నారు. వెనుబడిన వర్గాల బాగు కోసం, నిరాధరణకు గురైన వర్గాల బాగు కోసం తొలిమెట్టు ఇది అన్నారు. వైఎస్ఆర్ జీవితం మొత్తం జనంతో ముడిపడి ఉందని, ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ముందుకెళ్లే కుటుంబం తమది అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని కుటుంబం అన్నారు. షర్మిలమ్మ పార్టీ పెట్టి 16 నెలలే అయినా అనేక పోరాటాలు చేసిందన్నారు. అధికార పక్షం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ప్రజల కోసం ముందుకెళ్లిందన్నారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే లాఠీ చార్జ్ చేశారని విమర్శించారు. రైతులను కాపాడు దొరా అని అంటే అరెస్ట్ చేశారని, ప్రజల బాధలను తీర్చండని అడిగితే కొట్టి, తిట్టి, ఈడ్చుకెళ్లారని విమర్శించారు. ఆడ వాళ్లు అని కూడా చూడకుండా అవమానించారని విమర్శించారు. షర్మిలమ్మ అంటే ఎందుకు అంత కక్ష? ధ్వేషం? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర నాయకుడు పిట్టా రాంరెడ్డి, లక్కినేని సురేందర్ పాల్గొన్నారు.