యువకుడి దారుణ హత్య.. పాత కక్షలే కారణమా..!

by Mahesh |   ( Updated:2023-11-22 05:07:21.0  )
యువకుడి దారుణ హత్య.. పాత కక్షలే కారణమా..!
X

దిశ, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన యువకుడు ఎం.నవీన్(24) తల పగలగొట్టి దారుణంగా హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై రాజ్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో గ్రామానికి చెందిన మరో యువకుడు హత్య చేశాడని అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణలో వెల్లడవుతాయని ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story