భద్రాద్రిలో బీఆర్ఎస్ విజయం చరిత్రే..

by Sumithra |   ( Updated:2023-12-04 12:48:13.0  )
భద్రాద్రిలో బీఆర్ఎస్ విజయం చరిత్రే..
X

దిశ, భద్రాచలం : భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించడం ఒక చరిత్రే అని చెప్పాలి. పార్టీ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహిరించిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు ఎత్తులకు కాంగ్రెస్ చిత్తయ్యుంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ విజయం సాధించినా.. విశేషం కాదు. కానీ భద్రాచలంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం, అదీ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరయ్యను ఓడించడం తెలంగాణా రాజకీయాలలో చిరస్థాయుగా నిలిచిపోతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో భద్రాచలం రామాలయం అభివృద్ధికి రు.100 కోట్లు ప్రకటించి 8 సంవత్సరాలు పూర్తిఅయ్యింది. అలాగే కరకట్ట ఎత్తు పెంచడానికి రు.1000 కోట్లు ప్రకటించారు. కానీ ఒక్క రూపాయు నిధులు విడుదల చేయక పోవడంతో ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది.

భద్రాచలం రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు తీసుకురాకపోవడం కూడా అనేక విమర్శలకు దారి తీసింది. ఇటువంటి పరిస్థితిలో రామాలయం అభివృద్ధికి బీఆర్ఎస్ ఏమి చేసింది అనే ప్రజల ప్రశ్నలకు ఎమ్మెల్సీ మధు వివరంగా తెలిపారు. రామాలయం అభివృద్ధి పోలవరం బ్యాక్ వాటర్ పై ఆధారపడి ఉందని, కేసీఆర్ కు 100 కోట్లు కేటాయుంచడం లెక్కకాదని, సుందరంగా నిర్మించుకున్న రామాలయం వరద ముంపునకు గురి కాకూడదు అనేది కేసీఆర్ అభిప్రాయం అని తెలిపారు. అలాగే కరకట్ట ఎత్తు పెంచడానికి నిపుణుల బృందం అనేక రాష్ట్రాలలో పర్యటించి ఆ ప్రాంత కరకట్టల నిర్మాణం పై అధ్యయనం చేసిందని, భద్రాచలం పట్టణంలోకి చుక్క నీరు రాకుండా నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయని వివరించడంలో మధు సక్సెస్ అయ్యారు. దీంతో కేసీఆర్ భద్రాద్రిని పట్టించుకోవడం లేదు అనే విమర్శలకు చెక్ పెట్టినట్లయ్యుంది. మధు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికలకు నెల రోజులు ముందు నుండే భద్రాచలంలో మకాం పెట్టి అన్ని వర్గాలవారిని ప్రత్యేకంగా కలుస్తూ... బీఆర్ఎస్ విజయానికి దోహదపడ్డారు.

నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాలలో సైతం మధు పర్యటించడం విశేషం. ఒకానొక దశలో అభ్యర్థి వెంకట్రావా..? తాతా మధునా..? అనే విమర్శలు కూడా వచ్చాయి. అయినా విమర్శలను లెక్క చేయకుండా, అనేకమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి విజయం సాధించారు. సీపీఐ రాష్ట్ర నాయకులు రావులపల్లి రామ్ ప్రసాద్ బీఆర్ఎస్ లో చేరడం వెనుక ఎమ్మెల్సీ మధు రాజకీయ ఎత్తుగడ అనే చెప్పాలి. భద్రాచలం సీటును గెలుపొందడం ప్రతిష్టాత్మకంగా బావించిన కేసీఆర్ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా ఉన్న తాతా మధును భద్రాచలం ఇంచార్జిగా నియమించారు. 2018 ఎన్నికలలో వైఫల్యాలను పరిగణలోకి తీసుకుని టికెట్ దక్కని అసమ్మతి వాదులను బుజ్జగించి, వర్గ విబేధాలకు చెక్ చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఒకే తాటిపైకి తీసుకు వచ్చారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పాలన గురించి, పధకాల గురించి ప్రజలలోకి తీసుకు వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరయ్య పై 5719 ఓట్లు సాధించడంలో ఎమ్మెల్సీ మధు ప్రధాన భూమిక పోషించారు.

Advertisement

Next Story

Most Viewed