- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కందాల గెలుపును ఎవరు అపలేరు..
దిశ, ఖమ్మం రూరల్ : వచ్చేసార్వత్రిక ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి గెలుపును ఎవరు అపలేరని బీఆర్ఎస్ రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. మంగళవారం రూరల్ మండలం నాయుడుపేట సెంటర్లో పాలేరు సీటును ఎమ్మెల్యే కందాలకే కేటాయించడం పట్ల రూరల్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు అభినందన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరులో గతంలో ఎవరు చేయని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కందాల చేసి నిరూపించాడన్నారు. కందాల ఫౌండేషన్ పేరుతో వేలాది మందికి అండగా నిలిచినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న మహవ్యక్తి ఎమ్మెల్యే కందాల అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సూడా డైరెక్టర్ గూడా సంజీవ్ రెడ్డి, రైతు కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న, మారెమ్మ గుడి చైర్మన్ మట్టా వెంకటేశ్వర్ల, వైస్ఎంపీపీ గుడిబోయిన దర్గయ్య, సొసైటీ చైర్మన్ జరుపుల లక్ష్మణ, సోషల్ మీడియా అధ్యక్షులు గద్దె సతీష్, బీసీ సెల్ కార్యదర్శి నాశబోయిన కనకయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమరబత్తిని మురళి, ముత్యం కృష్ణరావు, వెంపటి రవి, వెంపటి ఉపేందర్, యాత్ అధ్యక్షులు గౌర్రాజు శంకర్ రాజు, రెడ్యానాయక్, పెద్దతండా గ్రామ శాఖ అధ్యక్షులు బానోత్ మోహన్, ఉపాధ్యక్షులు వెలుగు సుధాకర్, కార్యదర్శి చీరాల వీరభద్రం, మానుకొండ శ్రీనివాస్, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.