- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Free Electricity : రేవంత్రెడ్డి మాటలను వక్రీకరించిన బీఆర్ఎస్
దిశ, టేకులపల్లి : రేవంత్రెడ్డి మాటలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని కాంగ్రెస్ నేతలు బుధవారం స్థానిక సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని, నిజంగా రైతులకు కేటాయించిన విద్యుత్ లో ఎటువంటి కోతలు నిర్వహించకుండా 8 గంటలు సరఫరా చేస్తే మేలు చేసినవారు అవుతారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వక్రీకరించారని పేర్కొన్నారు. దాంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తీవ్రంగా ఖండించారు. రైతులకు కనీసం 12 గంటలైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భూక్యా దల్ సింగ్ నాయక్, బేతంపూడి పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్, మండల పార్టీ అధ్యక్షుడు భూక్యా దేవా, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇస్లావత్ సాయి, బేతంపూడి సర్పంచ్ బాబు, మాజీ సర్పంచ్ రెడ్యా నాయక్, నాయకులు అజ్మీరా శివ, కోరం సురేందర్ , ఈది గణేష్, మూడ్ సంజయ్, బోడా మంగీలాల్ నాయక్, హత్తిరాం నాయక్, పూన్యా నాయక్, మోహమ్మద్ అఫ్రోజ్, రావూరి సతీష్, భుక్యా సర్ధార్, బానోత్ రవి, ఇస్లావత్ దేవ్ సింగ్,మోకాళ్ల సునీల్ పాల్గొన్నారు.