- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న బీజేపీ : ఎంపీ నామా
దిశ, కారేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బీజేపీ అడుగడుగున అడ్డు పడుతుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం కారేపల్లి మండలంలోని ఉసిరికాయలపల్లి, అప్పాయిగూడెం, రొట్టమాకురేవు రైతు వేదికలను ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ తాత మధుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే రాములునాయక్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ నామా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల నివక్ష చూపుతుందన్నారు. నిధులు వాటా ఇవ్వకుండా, సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకుంటూ పైశాచిక ఆనందం పొందుతుందని ఆరోపించారు.
అధికారం ఉన్న రాష్ట్రాల్లో వెలగబెట్టని వారు తెలంగాణకు వచ్చి వెలగబెడతామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు కష్టం తెలిసిన నేత కేసీఆర్‌అని రూ.65482 వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసిన నేత అని కొనియాడారు. తెలంగాణ రాక మందు సాగు, తాగునీటి కోసం తిప్పలు పడ్డామని, రైతులు అప్పులపాలైన రోజులు మరచిపోలేదన్నారు. విద్యుత్ చట్టం తీసుకొచ్చి సాగునీటికి మీటర్లు పెట్టాలనే షరతును మోడీ ప్రభుత్వం తెచ్చిందని దానిని పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. విద్యుత్ బిల్లుతో రైతుకు సాగుభారం కానుందన్నారు. పల్లెల అభివృద్ధికి ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్తున్నామని, ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్‌ను పెట్టి పరిశుభ్రతపై దృష్టిపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గత ఎన్నికలలో పొరపాట్లు జరిగాయని, ఆ లెక్కలు కూడా తెచ్చామని, గ్రామాల్లో ఓట్లలో వెనకబడ్డామని, నష్టం చేసిన వారు ఎవరో తెలుసని, వారి పేర్లు తన దగ్గర ఉన్నాయంటూ వ్యాఖ్యనించారు.
పార్టీకి, కారు గుర్తుకు నష్టం చేయకూడదని, 8 నెలలు ప్రజల్లో ఉండాలని కార్యకర్తలు, నాయకులను కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ వృద్దుల ఆత్మగౌరవాన్ని పెంచిన, అడ పిల్ల తల్లిదండ్రుల భారం తగ్గించిన నేత కేసీఆర్ అని కొనియాడారు. మంచి హృదయం ఉన్న ఎమ్మల్యే లావుడ్యా రాములునాయక్ అని, కేసీఆర్ డైరక్షన్‌లో పని చేస్తున్న నాయకుడన్నారు. 8 ఏళ్లు పార్టీలో ఉండి అన్ని అనుభవించిన వారు అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. కేసీఆర్ చేతి చలువతో రాజకీయ, ఆర్ధిక లబ్ధిపొంది ఆయన్ని విమర్శించే స్ధాయికి ఎదిగారని మాజీ ఎంపీ పొంగులేటి నుద్దేశించి విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో ఉండి రాజకీయ భిక్షపెట్టిన పార్టీకి ద్రోహం చేసిన వారు ప్రజాద్రోహి తో సమానం అని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి పనులకు ఎంపీ నామా హామీ
కారేపల్లి మండలంలో అభివృద్ధి పనులకు ఎంపీ నామా నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. నాలుగు గ్రామాల సీసీ రోడ్లకు ఎంపీ ల్యాడ్ నిధులు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రొట్టమాకురేవులో నామా ముత్తయ్య ట్రస్ట్ నుండి బోరు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్, జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, పీఆర్ డీఈ వెంకటరెడ్డి, తహసీల్ధార్ తూమటి శ్రీనివాస్, ఎంపీడీఓ చంద్రశేఖర్, వ్యవసాయాధికారులు బాబురావు,
కె.ఉమామహేశ్వర్‌రెడ్డి, బాలాజీ, పవన్, వాహిని, కమలాకర్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షప్రధానకార్యదర్శులు పెద్దబోయిన ఉమాశంకర్, ఇస్లావత్ బన్సీలాల్ టీఆర్‌ఎస్ ఆత్మకమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, అజ్మీర వీరన్న, ముత్యాల వెంకటప్పారావు, ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు దారావత్ పాంఢ్యానాయక్, భాగం రూపానాగేశ్వరరావు, మూడు జ్యోతి మోహన్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు భూక్యా రంగారావు, సర్పంచ్‌లు బానోత్ బన్సీలాల్, అజ్మీర అరుణ, ఈసం అరుణ పాల్గొన్నారు.