- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాచలం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
దిశ, భద్రాచలం : భద్రాచలం ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సమావేశం ఆదివారం స్థానిక జ్యోతి కాన్వెంట్ హై స్కూల్ నందు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి, జిల్లా అధ్యక్షులు బండి లక్ష్మణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాటి పరిష్కారానికి అసోసియేషన్ చేసినటువంటి కృషిని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల రికగ్నిషన్ రెన్యూవల్ కు సంబంధించి ఆయా పాఠశాలల కరస్పాండెంట్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా ఉన్నతాధికారుల తో సమన్వయం చేసుకుంటూ అండగా ఉన్నామని ఉద్ధాటించారు. అలాగే భవిష్యత్తులో కూడా అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ప్రైవేటు పాఠశాలలకు
ఎటువంటి సమస్య వచ్చినా తమ ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భద్రాచలం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పలివెల రవికుమార్( కోమల హై స్కూల్ భద్రాచలం) , ప్రధాన కార్యదర్శిగా అనుమాండ్ల శ్రీధర్ రెడ్డి( జ్యోతి కాన్వెంట్ హై స్కూల్ భద్రాచలం) , కోశాధికారిగా గోడపర్తి రాంబాబు( శాంతి విద్యా నికేతన్ నాగినేని ప్రోలు) , ఉపాధ్యక్షులుగా బి.నాగేశ్వరరావు( బ్రిలియంట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ సారపాక) ,
జాయింట్ సెక్రటరీగా గౌరీ శంకర్( శాంతి విద్యా నికేతన్ హై స్కూల్ చర్ల) , ఈసీ సభ్యులుగా పి.సురేష్ బాబు( సమత హై స్కూల్, భద్రాచలం), జె.మణికంఠ( గౌతమ్ మోడల్ స్కూల్ భద్రాచలం) , లైక్ పాషా( న్యూ సెంచరీ హైస్కూల్ బూర్గంపాడు) , గిరి( గురుదేవ్ హైస్కూల్ చర్ల) ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో కేశవ్( రూప స్కూల్ భద్రాచలం) , కోటిరెడ్డి( శ్రీనివాస విద్యానికేతన్ లక్ష్మీపురం) , కిషోర్( దివ్య హై స్కూల్, భద్రాచలం) రమణ( దివ్య హై స్కూల్, భద్రాచలం) తదితరులు పాల్గొన్నారు.