వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు

by Sridhar Babu |
వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు
X

దిశ,ఇల్లందు : ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మితంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు ఎప్పుడు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం డయాలసిస్ సెంటర్ ను తనిఖీ చేశారు.

పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ను పరిశీలించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వైద్యులు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఆరోగ్యాన్ని రక్షించడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, వారి ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా పని చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఐఎన్టియూసీ నాయకుడు పడిదల నవీన్ పాప ప్రస్తుత పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెండెంట్ డా. హర్షవర్ధన్, ఆర్ఎంఓ డా. రామ్ నివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి, మండల రాము, కాకటి భార్గవ్, పడిదల నవీన్, నాయకులు బానోత్ శారద, ఉల్లింగ సతీష్, బక్కతట్ల వెంకన్న, పందిళ్ల వెంకటేశ్వర్లు, రవి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed