ఈసారి మరింత హైట్ లో ఖైరతాబాద్ గణపతి విగ్రహం.. ఎంత ఎత్తంటే?

by Prasad Jukanti |
ఈసారి మరింత హైట్ లో ఖైరతాబాద్ గణపతి విగ్రహం.. ఎంత ఎత్తంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో జరిగే గణేశ్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణనాథుడు స్పెషల్ అట్రాక్షన్ అనే సంగతి తెలిసిందే. గతేడాది 63 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన మహాగణపతి ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో మట్టి ప్రతిమగా సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు నిర్జల ఏకాదశి రోజైన ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఉత్సవ కమిటీ ప్రతినిధుల సమక్షంలో కర్రపూజతో గణపతి తయారీ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. ఈసారి కొత్త కమిటీ ఆధ్వర్యంలోనే ఉత్సవాలు నిర్వహిస్తుండటం విశేషం.

Advertisement

Next Story