- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Khairatabad Ganesh: మహా గణపతిని దర్శించుకున్న హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
దిశ, డైనమిక్ బ్యూరో: ఖైరతాబాద్ గణేష్ ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. తెలంగాణలో వినాయక చతుర్ధి నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేక ప్రసిద్ది చెందింది. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా 70 అడుగుల్లో పెద్ద గణపతి విగ్రహాన్ని ప్రతిష్టంపజేశారు. ఈ నవరాత్రి ఉత్సవాలను శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నారు. దీంతో ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూజారులు గవర్నర్ కు ఆశీర్వచనం అందించారు. మంగళవారం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉండటంతో అతి పెద్ద ఖైరతాబాద్ గణేష్ ను చూడటానికి హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.