TG: రేపటి నుంచి కాలేజీల్లో క్లాసులు బంద్‌

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-16 13:12:14.0  )
TG: రేపటి నుంచి కాలేజీల్లో క్లాసులు బంద్‌
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఫార్మసీ కాలేజీ(pharmacy colleges)ల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌‌తో నిరసనలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం నుంచి కాలేజీల్లో క్లాసుల బంద్‌ చేస్తున్నట్లు యాజమాన్యాల నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు.. వారం తర్వాత నిరవధిక బంద్‌కు వెళ్తామని ప్రకటించాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీల్లో క్లాసులు బంద్ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సుమారు రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయినట్లు సమాచారం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏళ్ల తరబడి నిధులు విడుదల చేయకపోవడంతో భారీగా బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. గత ఏడాది డిసెంబరు 7న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ ఫీజులను చెల్లించాల్సిందేనంటూ విద్యార్థులపై ఆయా కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed