Deepa Dasmunsi: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌ను చూస్తుంటే హ్యాపీగా ఉంది

by Gantepaka Srikanth |
Deepa Dasmunsi: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌ను చూస్తుంటే హ్యాపీగా ఉంది
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) బాధ్యతలు చేపట్టడంపై ఏఐసీసీ(AICC) సెక్రటరీ జనరల్ దీపాదాస్ మున్షి(Deepa Dasmunsi) స్పందించారు. ఆదివారం ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ(TPCC) చీఫ్ పదవి చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీలో కిందిస్థాయి నుంచి మహేశ్ కుమార్ గౌడ్ ఎదిగారని తెలిపారు. కష్టపడ్డ కార్యకర్తలను పార్టీలో గుర్తించి ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అన్నారు.

మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ మధ్యాహ్నం గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో టీ.కాంగ్రెస్ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు హాజరయ్యారు. గాంధీ భవన్‌లోని ఆయన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed