- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ కుటుంబంలో అందరిమీదా కేసులు ఉన్నయ్.. కడియం శ్రీహరి హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవకముందే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరిమీదా కేసులు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ఎందుకు బయపడుతున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఆర్బీఐ అనుమతులు లేకుండా డబ్బులు మళ్లించారని అన్నారు.
ఒకవేళ కేటీఆర్(KTR) మీద పెట్టింది లొట్టపీసు కేసే అయితే ఏసీబీ, ఈడీ ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఢిల్లీలో తెలంగాణ పరువును మంటగలిపారని మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కేటీఆర్ ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. రూ.40 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలున్నాయని చెప్పారు. బాండ్ల రూపంలో కేటీఆర్‌కు 40 కోట్ల రూపాయలు తిరిగి వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత జరిగినా కేటీఆర్ అహంకారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.