దసరా వేళ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-11 13:03:19.0  )
దసరా వేళ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచేందుకే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు. శుక్రవారం ఇంటిగ్రేటెట్ పాఠశాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకున్నదని విమర్శించారు. గట్టలకు గుట్టలు తొవ్వి మట్టిని అమ్ముకున్నారని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. త్వరలో నాగార్జునసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పారు.

భూ నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే పంటలబీమా పథకం తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. త్వరతో రైతుబీమాతో పాటు సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు అందిస్తామని దసరా(Dussehra) వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు రుణమాఫీ కానీ రైతుల కోసం మరో రూ.13 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమ కోసం బడ్జెట్‌లో రూ.50వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రూ.18 వేల కోట్లతో ఇప్పటికే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. మరో రూ.13 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాల్సి ఉందని.. వాటిని కూడా త్వరలోనే మాఫీ చేస్తామని తుమ్మల స్ఫష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed