గద్దర్ అవార్డులపై DCM భట్టి విక్రమార్క కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
గద్దర్ అవార్డులపై DCM భట్టి విక్రమార్క కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గద్దర్ సినీ అవార్డుల(Gaddar Awards)పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(DCM Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం(LB Stadium)లో నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలకు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళలను ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామని.. ఈ వార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.

నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నారని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ అలేఖ్య పుంజాల అన్నారు. సీఎం సూచనల మేరకు భక్త రామదాసు 392వ జయంతి(Bhakta Ramadasu Jayanthi) ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు 600 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్నారని వివరించారు.

Next Story