- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR : కేసీఆర్ నాయకత్వమే కొనసాగుతుంది : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. తమ పార్టీ ఎప్పటికీ కేసీఆర్(KCR) నాయకత్వంలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎలాంటి పనులు చేయకుండానే విజయాలు జరుపుకోవడం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ది నిజంగా సాహసమే అన్నారు. ఏడాది కాలంలో ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని.. ఒక్క పని కూడా చేయకుండానే ఈ సెలెబ్రేషన్స్ జరపడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి చేసింది 'కేసీఆర్ తిట్లు హామీలకు తూట్లు' మాత్రమే అన్నారు. మూసీ(Musi) ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కాని దానికి లక్షా యాభై వేల కోట్లు ఎందుకని ప్రశ్నించారు. కేవలం రూ.1100 కోట్లతో గోదావరి నీళ్ళు గండిపేటలో నింపితే సరిపోయే దానికి లక్షల కోట్ల అవసరం ఎందుకు అన్నారు. ఆ కోట్ల రూపాయలు ఢిల్లీకి మూటలు మోయడానికే అని వెల్లడించారు. ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందనేది నిజమని కావాలంటే తాను రాజీనామా చేస్తానని, రేవంత్ రెడ్డి కూడా కొండంగల్ నుంచి రాజీనామా చేసి మళ్ళీ నిరూపించుకోవాలి అని కేటీఆర్ సవాల్ విసిరారు.
- Tags
- Ktrbrs