- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓటమి ఖాయం: షబ్బీర్ అలీ

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుండి పోటీ చేయడంపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారని అన్నారు. గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ ఓడిపోతారన్నారు. కాగా, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను తెలంగాణ భవన్‌లో విడుదల చేసిన కేసీఆర్.. రానున్న ఎన్నికల్లో గజ్వేల్‌తో కామారెడ్డి నుండి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Next Story