- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR: ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్.. కీలక విషయాలు వెల్లడి
దిశ, వెబ్‌డెస్క్: కొన్ని రోజులగా రాష్ట్రాన్ని పొలిటికల్‌గా షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. ఇవాళ ఆయన ఓ ప్రముఖ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త విషయం కాదన్నారు. గూఢచారి వ్యవస్థ, వేగులు అనేవి అనాదిగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఏ దేశానికి, రాష్ట్రానికైనా నిఘా వ్యవస్థ అనేది అవసరం అని అన్నారు. అందుకు సమాచార సేకరణ కోసం ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. ట్యాపింగ్ అనేది పరిపాలన సంబంధమైన వ్యవహారమని తెలిపారు. ఆ పని ప్రభుత్వం చేయదని.. పోలీసులే చేస్తారంటూ సమాధానమిచ్చారు. ఫోన్లు ట్యాపింగ్ చేయాలని సీఎం, మంత్రులు చెప్పరని అన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వదా అని ప్రశ్నించారు. మొత్తానికి ట్యాపింగ్ అంశం ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యత అని.. ప్రభుత్వానిది కాదంటూ కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.