ఆ విషయంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా సారీ చెప్పాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన డిమాండ్

by Ramesh Goud |
ఆ విషయంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా సారీ చెప్పాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకొచ్చినందుకు కేసీఆర్ (KCR) అసెంబ్లీ (Assembly) సాక్షిగా క్షమాపణలు (Sorry) చెప్పాలని భువనగిరి (Bhuvanagiri) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మాజీ సీఎంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. లేడికి లేచిందే పరుగు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత కేసీఆర్ మంగళవారం బీఆర్ఎస్ భవన్ (BRS Bhavan) లో ప్రెస్ మీట్ పెట్టి, తన మాటల చమత్కారంతో అవాకులు చెవాకులు పేలుతున్నాడని, పదేండ్లు ఫామ్ హౌస్ కు పరిమితమై, నేడు కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్ధేషం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆయన అసమర్థ పరిపాలనతో రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి, ఇప్పుడు మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ (Demand) చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) చేసిన అప్పులను రీస్ట్రక్చర్ (Loans Restructure) చేసే ప్రయత్నం చేస్తుంటే.. బీజేపీ నేతలతో (BJP Leaders) కుమ్మక్కు అయ్యి కాంగ్రెస్ పాలనపై అబాండాలు మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిపాలనలో ఏనాడూ సెక్రటేరియట్ (Secretariet) ముఖం చూడని కేసీఆర్.. ప్రతీరోజు సెక్రటేరియట్ కి వచ్చి పనిచేసే రేవంత్ ప్రభుత్వంపై (Revanth Reddy Government) విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

దీనికి నిదర్శనం రాజీవ్ యువ వికాసం పథకమేనని (Rajiv Yuva Vikas Scheame) తెలిపారు. రాజీవ్ యువ వికాసం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బృహత్తర పథకమని, నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది అని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ఈ స్కీమ్ కింద రూ.6 వేల కోట్ల నిధులు వెచ్చించనుందని, ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. అలాగే అర్హులైన ప్రతీ ఒక్కరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రజలకు అర్ధం అవుతుందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.

Next Story

Most Viewed