కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండించిన కేసీఆర్.. మోడీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండించిన కేసీఆర్.. మోడీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రతిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవ‌హ‌రిస్తున్నదని మండిపడ్డారు.

దీనికి ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థల‌ను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ ప్రభుత్వ చ‌ర్యల‌ను భారత రాష్ట్ర స‌మితి తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్.. అక్రమ కేసుల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుదల చేయాల‌ని ఈ సందర్భంగా కేసీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story