స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నికపై KCR జోస్యం

by Gantepaka Srikanth |
స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నికపై KCR జోస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌(KCR)ను తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) కలిశారు. మంగళవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌(KCR Farmhouse)లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌(Station Ghanpur)కు ఉప ఎన్నిక రావడం ఖాయమని అన్నారు. ఆ ఉప ఎన్నికల్లో రాజయ్య గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సైతం జరిగింది.

పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ఎం.సంజయ్‌ కుమార్‌, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరిలు ఉన్నారు.

Next Story

Most Viewed