అమరవీరుల స్తూపం వద్దకు KCR.. దద్దరిల్లిన గన్ పార్క్ పరిసరాలు..!

by Satheesh |
అమరవీరుల స్తూపం వద్దకు KCR.. దద్దరిల్లిన గన్ పార్క్ పరిసరాలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు శనివారం ప్రారంభయ్యాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్కులో తెలంగాణ అమరవీరుల స్తూపానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. కొవ్వొత్తితో అమరజ్యోతిని వెలిగించి ఘన నివాళుర్పించారు. గన్ పార్కు నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీని కేసీఆర్‌ ప్రారంభించారు. రెండు వేల మందికి పైగా కార్యకర్తలు తరలించ్చారు. ర్యాలీలో పార్టీ కేడర్‌తో పాటు తెలంగాణ కవులు, కళాకారులు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. బోనాలతో మహిళలు వచ్చారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

పార్టీ కార్యకర్తల నినాదాలతో గన్‌పార్కు పరిసరాలు మారుమోగాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ర్యాలీకి సారథ్యం వహించగా, మాజీ మంత్రి హరీష్‌రావుతో పాటు మాజీ మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొనగా, ఈ ర్యాలీ సుమారు రెండు గంటల పాటు ర్యాలీ కొనసాగింది. వీరుల్లారా వందనం.. అంటూ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పాటలు పాడారు. సెక్రటేరియట్‌ ఎదురుగా బృందగానం చేసేందుకు అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో కొంత సేపు వాగ్వివాదం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed