- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ అంటే నమ్మకం కాంగ్రెస్ అంటే నాటకం
దిశ, డైనమిక్ బ్యూరో: మంచి కంటే చెడు వేగంగా వ్యాప్తి చెందుతుందని అందుకే సోషల్ మీడియా వేదికగా కొందరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. 30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే వచ్చే ఐదేళ్లు సీఎం గా కేసీఆర్, మీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం అయితే కాంగ్రెస్ అంటే నాటకమని విమర్శించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని పనులు కేసీఆర్ చేశారని బీఆర్ఎస్ స్కీమ్స్ అన్నీ సూపర్ హిట్ అన్నారు. కర్ణాటక రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు. కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టో జనాల వద్దకు చేర్చాలని సూచించారు.
యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని వ్యవసాయాన్ని దండగగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ లో ఎవరికి వారే సీఎం అంటున్నారని గత ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈడ్చికొడితే ఎక్కడో పడ్డారని ఎద్దేవా చేశారు. కొంత మంది డబ్బుల కోసం అమ్ముడు పోతే మేము ప్రజల్లో ఉంటాం. ప్రజల్ని నమ్ముకుంటామన్నారు. మనుషులను కొంటారు కావొచ్చు గానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేరని ఉద్యమం సమయంలో ఒకరు రైఫిల్ పడితే మరొకరు రాజీనామా చేయకుండా పారిపోయారని సెటైర్ వేశారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపే చూపుతున్నాయని ఎవరెన్ని ట్రిక్కులు వేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరేనన్నారు.