- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ముందు అసలైన అగ్నిపరీక్ష..!
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో కర్ణాటకలో బీఆర్ఎస్ పాత్ర ఏంటి అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ఫలితాలు కేసీఆర్ కు అగ్నిపరీక్షగా మారే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక ఎన్నికలు ముగిసిన ఏడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో కర్ణాటకలో వచ్చే ఫలితాలు కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది కేసీఆర్ మదిలో మెదులుతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి బీఆర్ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా కర్ణాటక అసెంబ్లీ బరిలో తమ అభ్యర్థులను నిలపాలని గులాబీ పార్టీ అధిష్టానం తొలుత భావించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు, తెలుగు మాట్లాడే వారు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు గతంలో సంకేతాలు ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఆ వ్యూహం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సమయం లేకపోవడం కారణంగా చూపి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీఆర్ఎస్ స్కిప్ చేస్తూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పొరుగు రాష్ట్రంలో ఎన్నికల రంగంలోకి దిగాలని కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
కేసీఆర్ నిర్ణయం వెనుక అసలు రీజన్ ఇదేనా..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక వేళ పోటీకి దూరంగా ఉంటే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం తమ ప్రధాన ఉద్దేశం కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఛాన్స్ బీఆర్ఎస్ కు ఉంటుంది. అందువల్లే తాము అసెంబ్లీ బరిలో పోటీకి దూరంగా ఉన్నామని చెప్పే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు తమ మిత్రపక్షమైన జేడీఎస్‌కు మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. ఇటీవలే కుమార స్వామి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. మమతా బెనర్జీ కూడా తమ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారని జేడీఎస్ నేతలు స్పష్టం చేశారు.
మమతా, కేసీఆర్, అఖిలేష్ వంటి నేతలు జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాము మరింత ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పే అవకాశం ఉందనే ఆలోచనలో కేసీఆర్ ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఒక వేళ పోటీకి దూరంగా ఉండే దాని వెనుక అసలు కారణం ఇదే అవుతుంది అంటూ మరో అంశంపై చర్చ జరుగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో బీఆర్ఎస్ పోటీకి దిగి చేదు అనుభవం మూటగట్టుకుంటే అది బీఆర్ఎస్ తొలి ప్రస్థానంలో ప్రధాన అవరోధంగా మారే అవకాశం ఉంది. దాని ప్రభావం వచ్చే తెలంగాణ అసెంబ్లీ, ఇతర ఎన్నికల్లో చూపుతుందనేది గులాబీ బాస్ ఆలోచన అట.
అందువల్ల కర్ణాటక అసెంబ్లీలో బీఆర్ఎస్ పోటీ ఎదురు దెబ్బ తగిలించుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండి జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం చేయడం ద్వారా జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలతో నడిచిపోవడమే ఉత్తమం అనే అభిప్రాయానికి వచ్చినా రావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కుమార స్వామి నుంచి ప్రచారం కోసం కేసీఆర్ కు ఇప్పటివరకు ఆహ్వానం అందలేదు. దీంతో ప్రచారం జరుగుతున్నట్లుగా కర్ణాటక బరి నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా లేక పోటీకి దిగి తన నేషనల్ ఎజెండాపై అదృష్టాన్ని పరీక్షించుకుంటుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
కష్టపడి గెలిపిస్తే.. అవమానిస్తున్నారు..! జైపాల్‌రెడ్డి అసహనం