బీఆర్ఎస్‌కు మరో గండం.. అధికారులకు సీఎం కేసీఆర్ స్వీట్ వార్నింగ్..!

by Satheesh |
బీఆర్ఎస్‌కు మరో గండం.. అధికారులకు సీఎం కేసీఆర్ స్వీట్ వార్నింగ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది నార్మల్‌ కంటే తక్కువ వర్షపాతం కురుస్తుందనే వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర సర్కారు అలర్ట్ అయింది. వర్షాభావ పరిస్థితులతో కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి తేలిపోతుందని నిపుణులు, మేధావులు ఆరోపణలు చేస్తున్న సమయంలో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ పెట్టారు. పలువురు మంత్రులు, వివిధ విభాగాల అధికారులతో సచివాలయంలో సమీక్షించారు.

సాగు, తాగునీటి అంశాలపై జాగ్రత్తలు చెప్పారు. ఇరిగేషన్ శాఖకు ఇది టెస్టింగ్ టైం అంటూ అధికారులను సున్నితంగా హెచ్చరించారు. వర్షాభావ పరిస్థితులతోనే తెలంగాణలో ఈ ఏడాది సాగు పనులు, నాట్లు ఆలస్యమవుతున్నాయి. కంది, మొక్కజొన్న, పత్తి తదితర పంటల సాగు కూడా నెమ్మదించింది. సీజన్‌ను ఒక నెల ముందుకు జరపాలని ప్రభుత్వం భావించినా వాతావరణ పరిస్థితుల కారణంగా నెల ఆలస్యమవుతున్నది.

అప్పుడు అతివృష్టి.. ఇప్పుడు అనావృష్టి

అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోగా ప్రభుత్వం సాయం అందించకపోవడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. దీనికి తోడు వానాకాలం మొదలైనా వర్షాల ఆలస్యం కావడంతో సాగు పనులు లేట్ అయ్యాయి. రానున్న రోజుల్లో సాగు నీరు అందకపోతే రైతులు ఇబ్బందుల్లో పడతారు. ఇది గమనించిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసహనం, ఆగ్రహం పెరిగే అవకాశం ఉండటంతో విషయాన్ని కేసీఆర్‌కు వివరించారు. దీంతో సీఎం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి చర్చించారు.

Advertisement

Next Story