- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్‌ను కలవనున్న బీజేపీ నేతలు.. డిమాండ్ ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో అసలేం జరుగుతోందనే దానిపై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్‌పై గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీ నేతలు సిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ప్రజలు ఈ ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారని అందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలని కోరబోతున్నట్లు బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధించేందుకు సీఎం కేసీఆరే స్వయంగా మంచి కారణం చూపించారని లీకేజీలు, అక్రమ అరెస్టులు, నిర్భంధాలపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కేసీఆర్ ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని నిన్న బండి సంజయ్ కేసీఆర్ పొలిటికల్ డిగ్రీ సర్టిఫికెట్ అడిగారని ఆ కోపంతో ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారాయి. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన అమలు చేస్తుంది.
ప్రస్తుతం గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరుస్తున్నారని, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇటీవలే గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తాజాగా బీజేపీ సైతం ప్రెసిడెంట్ రూల్ అమలు చేయాలని కోరబోతుంటడం సంచలనం అవుతోంది.
Read more:
హన్మకొండ అదాలత్ వద్ద ఉద్రిక్తత.. ఇరు పార్టీల నాయకుల పోటాపోటీ నినాదాలు