కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి : వెంకట్ రెడ్డి

by Naresh |   ( Updated:2023-08-25 15:27:33.0  )
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి : వెంకట్ రెడ్డి
X

దిశ, పీ.ఏ.పల్లి: పీ.ఏ.పల్లి బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి కర్ణాటక మాజీ మంత్రి ఔరద్, ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, 90 రోజులు పార్టీ కోసం నిరంతరం కృషి చేసి రాష్ట్రంలో నడుస్తున్న అవినీతి, నిరంకుశ పాలనను గద్దె దింపి కేసీఆర్ కి బుద్ది చెప్పాలని రాబోయే రోజుల్లో దేవరకొండ లో కాషాయ జెండా ఎగురవేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ కుమార్, కేతవత్ లాలు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేనమోని రాములు, అసెంబ్లీ కన్వీనర్ ఏటి కృష్ణ, పీ.ఏ పల్లి మండల జనరల్ సెక్రటరీ పాండు నాయక్, ఉపాధ్యక్షులు వలసాని రామలింగం, మెగావత్ నందు నాయక్, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు కొర్ర రాజు చౌహన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ నేలపట్ల వెంకన్న, సభ్యులు శ్రీమంతు నాయక్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed