- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు సంతోషంగా జీవించేలా చూడాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపవాస దీక్షల వల్ల శాంతి, సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని అభిప్రాయపడ్డారు. కాగా, నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. దేశ వ్యాప్తంగా రేపు ఉదయం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో అన్ని మసీదుల వద్ద ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మసీదులను ఇప్పటికే రంగులు వేయడమే కాకుండా విద్యుత్తు దీప కాంతులతో అలంకరించారు.
Next Story