BREAKING: లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ తర్వాత కవిత ఫస్ట్ రియాక్షన్ ఇదే..

by Satheesh |   ( Updated:16 March 2024 9:46 AM  )
BREAKING: లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ తర్వాత కవిత ఫస్ట్ రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమె నివాసం నుండి ఎయిర్ పోర్టు వరకు కారులో తరలిస్తోన్న అధికారులు.. ఢిల్లీ తీసుకువెళ్లేందుకు స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈడీ అధికారుల బృందం ఎయిర్ పోర్టుకు తరలిస్తున్న సందర్భంగా కవిత మాట్లాడారు. కారులో కూర్చుని కార్యకర్తలకు అభివాదం చేస్తూ చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూపించారు. భయపడవద్దని ధీమాగా ఉండాలని కార్యకర్తలు, అభిమానులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు బలంగా మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అనిచివేతను, దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం పైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటామని తెలిపారు. కవిత తరలింపు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పార్టీ శ్రేణులను సీనియర్ నాయకులు సముదాయించారు.

Read More..

Kavitha Arrest : ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ తరలిస్తున్న ఈడీ అధికారులు


👉 Read Disha Special stories


Next Story

Most Viewed