- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో కర్ణాటక ఫార్ములా.. కాంగ్రెస్ స్కెచ్ ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కర్నాటక ఫార్ములాను అమలు చేయాలని టీ– కాంగ్రెస్ భావిస్తున్నది. ఆరు నెలల ముందే టికెట్లు ప్రకటించడంతోపాటు కమ్యూనిటీ బేస్‌లో కమిటీలు వేయాలని ప్లాన్ చేస్తున్నది. ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అమలు చేసిన వ్యూహాన్నే ఇక్కడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే టికెట్ల పంపిణీపై గతంలో సునీల్ టీమ్ సర్వే చేయగా, తాజాగా ఓ మాజీ అధికారి (ఐఏఎస్) నేతృత్వంలో సర్వే చేయించినట్లు తెలిసింది. ఈ సర్వేల ద్వారా ఎవరికి టికెట్లు కేటాయించాలనే దానిపై ఇప్పటికే ఏఐసీసీ ఒక క్లారిటీకి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మండలాల వారీగా..
ప్రతి మండలంలో కులాల వారీగా కాంగ్రెస్ కమిటీలు వేయాలని కాంగ్రెస్ అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కుల సంఘాల నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నది. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కమిటీలను రూపొందించనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి నాయకులు కమిటీల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరు వరకు సభ్యుల పేర్లను టీపీసీసీకి పంపించాల్సి ఉన్నది. టీపీసీసీ టీమ్ ఆమోదించిన తర్వాత కమిటీలను ప్రకటించనున్నారు. ప్రతి టీమ్‌లో మహిళా నేతలు తప్పనిసరిగా ఉండాలనేది ఏఐసీసీ ఆదేశించినట్లు తెలిసింది.
అక్కడ పూర్తి కాగానే...
కర్ణాటక పరిస్థితులను తెలంగాణ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నది. అక్కడి ఫలితాలు ఇక్కడ ప్రభావం చూపే చాన్స్ ఉన్నదని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ ఎన్నికలు పూర్తి కాగానే ఏఐసీసీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణపై ఫోకస్ పెడతారని ఏఐసీసీ నాయకుల్లో ఒకరు తెలిపారు. అవసరమైతే ఇక్కడే మకాం వేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు.