- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీకాంత్ కుటుంబానికి దిక్కెవరు? వీటీసీ కార్మికున్ని మైన్‌లోకి ఎలా?
దిశ, గోదావరిఖని, రామగిరి: మైనింగ్ ఓకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (ఎంవీటీసీ) కార్మికునిగా పనిచేస్తున్న వారిని నిబంధనల ప్రకారం మైన్ లోపలకు దింపడం నిబంధనలకు విరుద్దమేనని తెలుస్తోంది.ట్రైనింగ్ సమయంలో పనిచేసే ముందు వారికి క్లాసులు నిర్వహిస్తారు. అనంతరం పని స్థలాల్లో ఎలా పని చేయాలనేది అవగాహనను కల్పిస్తారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా ట్రైనింగ్ సెంటర్ వ్యవహరించిన సింగరేణి యాజమాన్యం సైతం చూసీ చూడనట్లు వదిలేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నాయి.అయితే వీటీసీ కార్మికునిగా ఉన్న శ్రీకాంత్ ను గనిలోకి పంపించిన తప్పిదమేనని, ఈ తప్పు తమది కాదని, కాంట్రాక్టరేదేనని యాజమాన్యం అంటోంది. అయితే పని చేయించే సమయంలోనే యాజమాన్యం నిబంధనలు పాటించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని పలువురు కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఎవరికి వారు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఈ రోజు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ఈ కాంట్రాక్టర్, యాజమాన్యం నడుమ శ్రీకాంత్ కుటుంబానికి పరిహారం అందుకోలేని పరిస్థితి తయారైంది.
తప్పేవరిది...?
ఏంవీటీసీ కార్మికుడు శ్రీకాంత్ ను గనిలోకి పంపించడం కాంట్రాక్టర్ తప్పిదమని, తనపై తప్పిదం పడకుండా యాజమాన్యం జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.ఇందుకు పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ దేనని కూడా సింగరేణి అధికారులు వాదిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ చేసిన తప్పిదానికి శ్రీకాంత్ కుటుంబం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. కానీ కాంట్రాక్టర్ శ్రీకాంత్ ను గనిలోకి పంపించడం విషయంలో కాంట్రాక్టర్ తప్పు చేసినట్టయితే అతనిని సింగరేణి అధికారులు మైన్ లోకి అనుమతించనట్టయితే ప్రాణాలతో ఉండేవాడు కదా? అని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. శ్రీకాంత్ కుటుంబానికి పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో తమ తప్పిదం లేదని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే తప్ప మరోటి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఏంవీటీసీ కార్మికునికి పనులు అప్పగించిన విషయంలో అటు కాంట్రాక్టర్ ఇటు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి.
తెల్లారితే విధుల్లో చేరే వాడు...
48 రోజుల ఏంవీటీసీని ట్రైనింగ్ లో భాగంగా చివరి రోజు పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లారితే విధుల్లో చేరే సమయంలో చివరి రోజు జరిగిన ఈ ప్రమాదం వారి కుటుంబంలో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ ప్రమాదంలో మృత్యువాత పడడంతో శ్రీకాంత్ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంతో పాటు కాంట్రాక్టర్ పై ఉందని అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. కాంట్రాక్టర్ పనుల్లోకి పంపిస్తున్న కార్మికుల గురించి దృష్టి సారించకపోవడం వల్లే కంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా పనులు
ఏఎల్ పీ గని లో జరిగిన ప్రమాద స్థలం వద్ద సుమారు 900 మంది కార్మికులతో పని చేయాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి ఏంవీటీసీ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకొని పని స్థలం వద్ద సుమారుగా 2000 మంది కాంట్రాక్టు కార్మికులతో పని చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.జేమ్ కో కంపెనీకి చెందిన ఏంవీటీసీ యాజమాన్యం సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులతో పనిచేయుచున్న బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతను సాధిస్తుంది. కానీ పని చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ఉద్యోగ భద్రతతో లేకుండా పోయిందని పలువురు నాయకులు మండిపడుతున్నారు. గంటల వ్యవధిలో జరిగిన ఈ ఘటన ఓ కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయేలా చేసింది.