- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధిలో మనమే ముందున్నాం : ఎమ్మెల్యే సతీష్
దిశ, చిగురుమామిడి : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సుందరగిరి శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన పాల ఉత్పత్తిదారుల సంస్థ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం చిగురుమామిడి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు రూ.21 లక్షల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను 21 మంది లబ్ధిదారులకు, రూ.4.78 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను 19 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు తోడుగా ఉండాలనే లక్ష్యంతోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన పథకాలు ఉండడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మామిడి అంజయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు శ్రీ మూర్తి రమేష్, బెజ్జంకి లక్ష్మణ్, నాయకులు బెజ్జంకి రాంబాబు, వంతడుపుల దిలీప్ కుమార్, మెడబోయిన తిరుపతి, జంగ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.