- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: కేటీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr)పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలబడుతున్నారని, వాళ్లిద్దరూ ఆర్ఎస్ బ్రదర్స్ అని మార్కెట్‌లో చెప్పుకుంటున్నారని కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. జేఏసీ వాళ్లు ధర్నాలు చేస్తే మధ్యలో పింక్ జెండా పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే మూర్ఖుడు కేటీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు చేసి పేదలు కేసులు అనుభవిస్తుంటే టీలు అమ్ముతున్నట్లు, దోసెలు వేసినట్లు, కూరగాయలు అమ్ముతున్నట్లు ఫొటోలు దిగి ఫాల్తు రాజీయాలు చేసిన వ్యక్తి కేటీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
‘‘ కేటీఆర్‌లా తండ్రి పేరు చెప్పి నేను రాజకీయాల్లోకి రాలేదు. డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచా. నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేశా. తొలి నుంచి కేసులు భరించా. జైళ్లకు పోయా. లాఠీ దెబ్బలు తిని ఈ స్థాయికి వచ్చాను. నువ్వు ఎలా రాజకీయాల్లోకి వచ్చావో చెప్పాలి. ఉద్యమకారుడిలా కేటీఆర్ చెలామణి అయ్యారు. ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో నవ్వు దోశలు వేసి ఫొటోలు దిగి, ఉద్యమకారుడిగా నటించి, అమెరికాలో చిప్పలు కడిగావు. చివరలో వచ్చి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తావు. రాజకీయాలు ఏమి తెలియవు. మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్ నీవు తీసుకున్నావు. అలా పక్కనున్న వాళ్లను కూడా మోసం చేసి రాజకీయాల్లో వచ్చావు. ప్రజలను మోసం చేసి కేసీఆర్ కుటుంబం మొత్తం రాజకీయాల్లో స్థిరపడింది. నిజమైన ఉద్యమకారులకు టికెట్ల ఇవ్వలేదు. ఇప్పుడు తోపు గాళ్లము అని మాట్లాడుతున్నారు. మరోసారి అంటే ప్రజలు రాళ్లతో కొడతారు. కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ అవినీతిపరులే. ఈ ప్రభుత్వం, గత గవర్నమెంట్ రెండూ రెండే. కాంగ్రెస్‌తో కొట్లాడేది మేం. సవాల్ విసిరేది మేం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కూడా మేమే. బీఆర్ఎస్‌కు అభ్యర్థులు లేరు. కేసీఆర్ తాగి ఫామ్ హౌస్‌లో పడుకున్నారు. అసెంబ్లీకి రాడు. మళ్లీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి. ’’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.