జగిత్యాలకు తాకిన లీకేజీ సెగ.. డొంక కదులుతోందా..?!

by Mahesh |   ( Updated:2023-03-21 02:49:03.0  )
జగిత్యాలకు తాకిన లీకేజీ సెగ.. డొంక కదులుతోందా..?!
X

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ సెగ జగిత్యాల జిల్లాకు తాకింది. ప్రశ్నా పత్రాలు లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజకీయ పార్టీల నాయకులతోపాటు ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ లీకేజీలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతికి జోక్యం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు కేటీఆర్ పీఏ తిరుపతి స్వగ్రామం మల్యాల మండలం పోతారంలో పర్యటించి వివరాలు సేకరించడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ కేసులో A2 ముద్దాయిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా మల్యాల మండలానికి చెందిన వ్యక్తి కావడం వీరిద్దరికి ముందు నుంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.

దిశ, జగిత్యాల ప్రతినిధి: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ సెగ జగిత్యాల జిల్లాకు తాకింది. ప్రశ్నా పత్రాలు లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజకీయ పార్టీల నాయకులతోపాటు ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలు రాసిన వారిలో ఎన్నారైలు, నేతల రిలేషన్స్ లీకైన గ్రూప్ వన్ పరీక్ష రాసిన వారిలో మల్యాల మండలానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులకు చెందిన బంధువులు, వారి పిల్లలు ఉన్నట్లుగా సమాచారం.

ఎన్నారైలు అయిన రాజశేఖర్ రెడ్డి సమీప బంధువులతోపాటు మల్యాల మండలానికి చెందిన ఓ గ్రామ సర్పంచ్ కూతురు, అల్లుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్ సమీప గ్రామానికి చెందిన నలుగురు పరీక్ష రాసి 100 మార్కులకు పైగా సాధించారని కేటీర్ పీఏ తిరుపతి గ్రామానికి చెందిన సుమారు 15మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాసినట్లుగా విశ్వసనీయంగా తెలియవచ్చింది. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని క్వశ్చన్ పేపర్లు లీక్ చేశారని సుమారు రూ.70 లక్షలు ఇది వరకు కొండగట్టు ఆలయంలో డైరెక్టర్‌గా పని చేసిన మల్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అనేక అనుమానాలు..!

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో A2 గా ఉన్న రాజశేఖర్ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ పీఏ తిరుపతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అట్ల రాజశేఖర్ ఇద్దరి మధ్య ముందు నుంచి ఫ్రెండ్షిప్ ఉందనే వాదనలు ఉపందుకున్నాయి. కాబట్టే రాజశేఖర్ ను తిరుపతి టీఎస్పీఎస్సీలో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉద్యోగంలో పెట్టించాడనే ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కంప్యూటర్లను అప్ గ్రేడ్ చేసే క్రమంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కు సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ తెలుసుకొని లీకేజీకి పాల్పడ్డట్లుగా తెలుస్తుంది. తవ్విన కొద్ది నిజాలు బయటకొస్తున్న ఈ కేసులో సిట్ అధికారుల సమగ్ర దర్యాప్తు అనంతరం ఎవరి ప్రమేయం ఎంత మేర ఉంది అనేది తెలిసే అవకాశం ఉంది.

2016 బ్యాచ్ పైనా సందేహాలు?

ఉమ్మడి రాష్ట్రంలో 2011 సంవత్సరంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ కోర్టు కేసుల అనంతరం రాష్ట్రం ఏర్పడ్డాక 2016 లో నిర్వహించారు. అయితే నిజామాబాదు జిల్లాలోని ఒకే ఎగ్జామ్ సెంటర్ నుండి 20కి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం పలు అనుమానాలకు తావునిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కీలక ఆఫీసర్ గా పనిచేస్తున్న అధికారి అమెరికాలో లక్షల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ కొలువు వదులుకొని ముందస్తు ప్రిపరేషన్ లేకుండానే టాప్ మార్కులతో ఉద్యోగం సాధించినట్లుగా తెలుస్తుంది.

అధికార పార్టీలోని రాష్ట్ర స్థాయి మహిళ నేతకు కోటి రూపాయలు ముట్టజెప్పి ఉద్యోగం సాధించినట్లుగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రిపేర్ అయిన అభ్యర్థులు సాధించలేని మార్కులు సదరు ఆఫీసర్ ఎలా సాధించిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే బ్యాచ్ కు చెందిన కొంతమంది అభ్యర్థులు ఈ విషయంలో కూపి లాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో కూడా స్కాం జరిగే అవకాశం ఉందని 2016 గ్రూప్-1 పరీక్ష పైన కూడా విచారణ చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed