- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

X
దిశ, గోదావరి ఖని: చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక వాడలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం అంబేద్కర్ జయంతి కావడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్టీపీసీ న్యూ పోరెట్ పల్లి చెరువులో ఎనమిదో తరగతి చదువుతున్న సాయి చరణ్, ఉమా మహేష్, విక్రమ్ అనే చిన్నారులు ఈత కొట్టేందుకు వెళ్లారు. అందులో ఎవ్వరికీ ఈత రాకపోవడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. గమనించి స్థానికులు మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీసి గోదావరి ఖని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న ఏసీపీ గిరి ప్రసాద్, సర్కిల్ ఇస్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్సై జీవన్ ప్రమాదం ఏవిధంగా సంభవించిందనే అనే దానిపై వివరాలను సేకరిస్తున్నారు.
Next Story