- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇదేం పద్ధతి... గత నివేదికలను కాపీ చేసి ఇచ్చారంటూ.. చైర్ పర్సన్ ఫైర్
వాడివేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం
దిశ, జగిత్యాల ప్రతినిధి: జిల్లాలోని వివిధ శాఖల్లో జరిగిన ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు తయారు చేసి సమావేశాల్లో ఇవ్వాల్సి ఉండగా గతంలో ఇచ్చిన నివేదికలను కాపీ చేసి ప్రస్తుత సమావేశాల్లో ఇచ్చారని.. ఇదేం పద్ధతి అంటూ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఫైర్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాత, శిశు ఆసుపత్రిలో శుభ్రత లేదని, సరైన వైద్యం అందడం లేదంటూ పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బాలింతల మరణాలపై వేసిన త్రీ మెన్ కమిటీ నివేదికలు ఏమయ్యాయని ఎంపీపీలు నిలదీశారు. సీఎం కేసీఆర్ ఆదేశించినా.. ఇరిగేషన్ అధికారులు తమ శాఖలో చేయాల్సిన పనులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.