- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రశాంతంగా ముగిసిన సెస్ ఎన్నికలు
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్(సహకార విద్యుత్ సరఫరా సంస్థ) 15 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతవాతావరణం లో ముగిసింది.15 డైరెక్టర్ స్థానాలకు మొత్తం 75 మంది అభ్యర్థులు బరిలో నిలవగా..పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల లోపు వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 202 పోలింగ్ కేంద్రాల లో 252 పోలింగ్ బూత్ లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూతుల సంఖ్య అధికంగా ఏర్పాటు చేయడంతో క్యూ లైన్లో ఎక్కువసేపు వేసి చూడనవసరం లేకుండా ఓటర్లు సులువుగా, వేగంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పోలింగ్ తీరును రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల అథారిటీ సుమిత్ర, సెస్ ఎన్నికల అధికారి మమత పరిశీలించారు. బూత్‌లోని సిబ్బందితో మాట్లాడి పోలీంగ్ సరళిని తెలుసుకున్నారు. సిరిసిల్ల శివనగర్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మానిటర్ చేశారు. క్షేత్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరిగేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
సిరిసిల్ల పట్టణం జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నీ బూత్ 5 ,6,7, 14 పోలింగ్ బూత్ లు, కుసుమ రామయ్య బాలుర జడ్పీహెచ్ఎస్ లో బూత్ నెంబర్ 3, 4,5 పోలింగ్ కేంద్రాల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వయంగా సందర్శించి పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు పోలింగ్ పర్సన్ లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. స్వేచ్ఛా యుతవాతావరణంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలన్నారు.జిల్లా వ్యాప్తంగా 252 పోలింగ్ బూత్ లలో సెస్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.పోలింగ్ పూర్తయిన అనంతరం సహకార ఎన్నికల అధికారులతో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో సమావేశమయ్యారు. నిబంధనల మేరకు కౌంటింగ్ సజావుగా జరిగేలా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.కాగా డిసెంబర్ 26న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 27న ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరుగుతుందని ఎలెక్షన్ ఆఫీసర్ బి మమత వెల్లడించారు.