- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రభుత్వం కోనుగోలు చేయాలి'
దిశ, జమ్మికుంట : జిల్లా కాంగ్రెస్ పిలుపులో భాగంగా జమ్మికుంట మండలంలో మార్కెట్ యార్డులోని కోనుగోలు కేంద్రాలని పూదరి రేణుక శివకుమార్ గౌడ్, ఎండీ ఇమ్రాన్, నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులపట్ల కనీసం కనికరం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఒకవైపు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో రైతన్నలు పూర్తిగా నష్టపోయి ఉన్న కొంచెం ధాన్యాన్ని కోనుగోలు కేంద్రాలకు పట్టుకస్తే తూకం పేరుతో, మాయిశ్చర్ పేరుతో, ధాన్యాన్ని కోనుగోలు చేయడంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు.
కనీసం వారిని పట్టించుకునే నాధుడే కరువైయ్యాడని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి పదవుల పై ఉన్న శ్రద్ధ రైతన్నలపై ఉంటే బాగుండేదని, నియోజకవర్గ రైతుల గోసలు కనబడవని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలులో ఇంకా ఇలాంటి జాప్యం జరిగితే, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు.