పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Shiva |
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల రూరల్: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల పరధిలోని చల్ గల్, మోతె గ్రామాల్లో నెలకొరిగిన పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. ముందుగా మోతే గ్రామానికి చెందిన కౌలు రైతు సంగెం భూమయ్య పంటను పరిశీలించారు. భూమయ్య ఎకరానికి 15 వేల చొప్పున 4 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న, టమాటా సాగు వేశానని, అకాల వర్షానికి మొక్కజొన్న నేలకొరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు.

చల్ గల్ లో చందా భూమయ్య, చినకొల భూమయ్య, బద్దం శ్రీనివాస్ పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారులతో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పంటను అంచనా వేసేందుకు అధికారులు సర్వే చేయాలన్నారు. అర్హులైన రైతులకు నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జున్ను రాజేందర్, సురేష్, వేణు, సతీష్, గంగాధర్, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed