మంచిర్యాల గడ్డ ఎవరికో అడ్డ.. అధికార పార్టీ‌లో ఆధిపత్య పోరు

by samatah |   ( Updated:2023-06-14 07:32:15.0  )
మంచిర్యాల గడ్డ ఎవరికో అడ్డ.. అధికార పార్టీ‌లో ఆధిపత్య పోరు
X

దిశ, మంచిర్యాల టౌన్: అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నం అయిన వెలా మంచిర్యాల లో రాజకీయం వేడెక్కుతుంది.అధికార బిఆర్ఎస్ పార్టీ లో ఆధిపత్య పోరు రగులుకుంది.సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాజి ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మెన్ పుస్కురి రామ్మోహన్ రావు ల మధ్య విబేధాలు తార స్థాయి కి చేరాయి.ఒకే పార్టీ కి చెందిన వారు అయినప్పటికీ కలిసి ఒకే వేదిక లు పంచుకున్న దాఖలాలు లేవు.పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలు గా చీలి పోయి సమయం వచ్చినప్పుడల్లా ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పుంచుకోడం మొదలైంది.వచ్చే ఎన్నికల్లో టికెట్ ధక్కించుకోవడనికి ఇద్దరు నేత లు చేస్తున తీరు నియోజక వర్గం లో హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల 6 న సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్ నడిపెల్లి దివాకర్ రావు ను దూరం పెట్టినట్లు సమాచారం రావడం తో అది కాస్త దివాకర్ అనుచర గణాన్ని కుదిపేసింది ,దానితో పాటు సీఎం కేసీఅర్ ప్రసంగం అనంతరం తిరిగి వెళ్ళే క్రమం లో దివాకర్ రావు కేసీఅర్ కు శాలువా కప్పి సన్మనిoచడానీకి వెళ్లిన సమయం లో ఆయన్ని సీఎం నెట్టేయడం తో నియోజక వర్గం లో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు అసంతృప్తి తో రగిలి పోతున్నరు.ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సర్వే లో ఎమ్మెల్యే పని తీరు సంతృప్తి గా లేదు అని అధిష్టానానికి తెలియడం తో ఈ సారి టికెట్ పుస్కురి రామ్మోహన్ రావు కు వస్తుంది అనే ఆశ లో ఆయన అనుచరులు ఉన్నారు.ఇదంతా పసి గట్టిన ఎమ్మెల్యే దివాకర్ రావు తనదైన శైలి లో ముందు కు వెళ్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు,తనకు కాక పోయిన కొడుకు విజీత్ కు ఎలా గా అయిన టికెట్ ఇప్పియలనే వాంఛ తో నియోజక వర్గం లో విస్పృతం గా సభ లు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాడు.దీనితో పాటు పుస్కురి రామ్మోహన్ కు సపోర్ట్ చేసే క్యాడర్ ను పక్కకు పెట్టీ వారి పై పలు అభియోగాలు మోపిస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పలు ఆరోపణలు సైతం నియోజక వర్గం లో వినిపిస్తున్నాయి.

చక్రం తిప్పుతున్న జిల్లా బాస్..

మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజక వర్గం లో తన దైన శైలిలో దూసుకుపోతున్నాడు.సీనియర్ లను పక్కన పెట్టడం ,అడ్డు వచ్చిన వారి పై అక్రమ కేసులు బనయించడం సుమన్ కు ఆనవాయితీ గా మారింది.అదే కోణం లో సుమన్ మంచిర్యాల నియోజక వర్గం లోను పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి ఎంపీ గా ఉన్నప్పుడు జిల్లా లో కొనసాగిన తన క్యాడర్ ను అంత మళ్ళీ తెర పైకి తీసుకొచ్చాడు.లక్షెట్టిపెట్ , దండేపల్లి మండలాల్లో ఉన్న తన అనుచరులతో రామ్మోహన్ రావు కు మద్దతు గా ప్రచారం చెపిస్తున్నాడు.వారు అంత తెర పైకి రాకుండా ఇటు దివాకర్ రావు కు సపోర్ట్ గ ఉంటూ నే రామ్మోహన్ కు మద్దతు తెలుపుతున్నారు.ప్రధానం గా కరీంనగర్ ఎమ్మెల్యే బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు సైతం ఇందులో హస్తం ఉన్నట్లు తెలుస్తుంది.గంగుల కమలాకర్ కు సన్నిహితుడు గా పేరు ఉన్న మ్యాధరిపేట కు చెందిన సీనియర్ నాయకుల్లో ఒకరు ఇటీవల మండల స్థాయి లో ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలను పోగు చేసి తన మామిడి తోట లో రహస్యం గా సమావేశం ఏర్పాటు చేసి రామ్మోహన్ కు అందరూ మద్దతు తెలపల్సింది గా కోరాడు అని , ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, కొడుకు విజిత్ లు ఎన్నికల సమయం కాబట్టి వారి పై మండి పడకుండా వారి తీరు పై తండ్రి కొడుకులు మౌనం గా ఉన్నట్లు తెలుస్తుంది. దండపల్లీ మాజి వైస్ ఎంపిపి,ప్రస్తుతం ఉన్న ఎంపిపి లు సైతం మార్కెట్ కమిటీ చైర్మన్ ను తమ అనుచరులకు వస్తుంది అనే ఆశ తో ఉండగా , ఎమ్మెల్యే తన అనుచరులకు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అని తెలుసుకొని వారు సైతం ఎమ్మెల్యే , విజిత్ కు వ్యతిరేకం గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.ఇలా దండపల్లీ లో దివాకర్, విజిత్ కు వ్యతిరేకం గా చక్రం తిప్పుతున్న నేతలు అంత బాల్క సుమన్ అనుచర ఘనమే.దానితో పాటు ఇటీవల లక్షేట్టిపెట్ మున్సిపాలిటీ లోని గోదావరి ఒడ్డున టియుఎఫ్ఐడిసి నిధులతో ఎమ్మెల్యే దివాకర్ రావు పార్క్ ను సాంక్షన్ చేశారు. అది అంత ముంపు ప్రాంతం కావడం,పార్కు నిర్మాణానికి ఎటువంటి అనుమతులు రాకపోవడం తో ప్రభుత్వ సొమ్ము ను ఇలా వృధా చేస్తున్నారు అని లక్షెట్టిపెట కు చెందిన బిఆర్ఎస్ జాగృతి నాయకులు ఒకరు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు కంప్లైంట్ చేయడం నియోజక వర్గం లో తీవ్ర దుమారమే రేపింది.అధికార పార్టీ లో కొనసాగుతూనే ఎమ్మెల్యే పై కలెక్టర్ కు కంప్లైంట్ చేయడం లో ఆంతర్యం జనాలను ,అక్కడి నాయకులకు అంతుపట్ట కుండా చేసింది. ఇదంతా చేసేది జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అనుచరులే అని, ఈ సారి దివాకర్ రావు కు టిక్కెట్ రాకుండా చేయాలనే బాల్క సుమన్ తన అనుచరుల తో ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు నియోజక వర్గం లోని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

అరవింద ర్ రెడ్డి సపోర్ట్ ఎవరికో..

మాజీ ఎమ్మెల్యే ,మలి దశ ఉద్యమ కారుడు గడ్డం అరవిందర్ రెడ్డి నియోజక వర్గం లో మౌనం పాటిస్తున్నారు.నియోజక వర్గం లో జరుగుతున్న విషయాలు అన్ని తెలుసుకుంటూ మౌనం గా ఉంటునారు.గతం లో పార్టీ టికెట్ ఆశించి బంగ పడ్డ అరవిందర్ రెడ్డి దివాకర్ రావు కు మద్దతుగా నిలిచి దివాకర్ గెలుపు లో తనదైన ముద్ర వేసుకున్నాడు.సింగరేణి ప్రాంతం లో అరవీందర్ రెడ్డి కి మంచి ప్రాధాన్యం ఉంది దానితో పాటు నియోజక వర్గం లోనూ అరవీందర్ రెడ్డి కు మంచి పట్టు ఉంది. తనకంటూ సొంత క్యాడర్ ఉండి ఇలా మౌనం గా ఉండడం నియోజక వర్గ ప్రజల్లో అంతులేని అనుమానాలకు తావిస్తోంది.గతం లో బిజెపి లో తన అనుచర గణం తో చెర బోతున్నాడు అని పలు విమర్శలు వచ్చాయి కానీ అవన్నీ విమర్శలు గానే మిగిలాయి.మరి నియోజక వర్గం పై ఇంత పట్టు ఉన్న నేత ,ఉద్యమ కారుడు ఇలా మౌనం గ ఉండడం పై ఆంతర్యం ఎంటో నియోజక వర్గ ప్రజలకు అంతు పట్టడం లేదు.అధికార బిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నాడ లేక పుస్కురి రామ్మోహన్ , దివాకర్ రావు ఇద్దరి లో ఎవరికి టికెట్ వచ్చిన మద్దతు గ నిలిచి వారి గెలుపు కోసం పని చేస్తాడా అనే వింత ఆలోచనలో నియోజక వర్గ ప్రజలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed