రుద్రవరంలో సబ్ స్టేషన్ ఏర్పాటు.. తీరనున్న ముంపు గ్రామాల కరెంట్ కష్టాలు

by Nagam Mallesh |   ( Updated:2024-08-10 09:21:10.0  )
రుద్రవరంలో సబ్ స్టేషన్ ఏర్పాటు.. తీరనున్న ముంపు గ్రామాల కరెంట్ కష్టాలు
X

దిశ, వేములవాడః వేములవాడ అర్బన్ మండలంలోని ముంపు గ్రామాల ప్రజల కరెంట్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. మండలంలోని రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీలో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1 కోటి 97 లక్షల 46 వేల నిధులు మంజూరు చేస్తూ టీజీ ఎన్ పీడీసీఎల్ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. రుద్రవరంలో సబ్ స్టేషన్ నిర్మించి తమ కరెంటు కష్టాలు తీర్చాలని అర్బన్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి వెళ్లగా వెంటనే స్పందించిన ఆది సమస్యను ఉన్నతాధికారులకు తెలపగా, వెంటనే వారు సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. మరోవైపు సబ్ స్టేషన్ నిర్మాణము పట్ల ముంపు గ్రామాల ప్రజలు,నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ, కృషి చేసిన ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed