వార్డెన్ నిర్వాకం.. నీటిలో మునిగి విద్యార్థి మృతి..

by Vinod kumar |   ( Updated:2022-12-04 14:59:37.0  )
వార్డెన్ నిర్వాకం.. నీటిలో మునిగి విద్యార్థి మృతి..
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సెయింట్ ఆంథోని స్కూల్లో బావి లో దిగిన ఎనిమిదో తరగతి విద్యార్థులలో ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి శ్రీకర్ (14) 8వ తరగతి స్టూడెంట్. బావిలో ఉన్న చెత్తను తీయడానికి విద్యార్థులు దిగారని స్కూల్స్ సిబ్బంది చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. ఈ ఘటనకు కారణమైన వార్డెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Advertisement

Next Story

Most Viewed