Breaking News.... బీఆర్ఎస్, బీజేపీకి భారీ షాకింగ్ న్యూస్

by S Gopi |   ( Updated:2022-12-15 16:45:49.0  )
Breaking News.... బీఆర్ఎస్, బీజేపీకి భారీ షాకింగ్ న్యూస్
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల వాతవారణం హీటెక్కింది. గురువారం నాడు నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 15 డైరక్టర్ స్థానాలకు గాను 179 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద ఎక్కువవడంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. తాము పోటీ చేయాలనుకున్న డైరక్టర్ స్థానంలో తమ తమ పార్టీలు అవకాశం ఇవ్వకపోవడంతో ఒక్క పార్టీలో నుంచి పలు డైరక్టర్ స్థానాల్లో ముగ్గురు నలుగురు వేశారు. ఎక్కువగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సెస్ ఎన్నికల్లో రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. దీంతో ఆయా పార్టీల ముఖ్య నేతలు, జిల్లా నాయకులు బుజ్జగింపుల పర్వం ప్రారంభించారు. రెబల్స్ కు భవిష్యత్ లో పదవుల ఆశలతోపాటు నయానో..భయానో ఇచ్చి నామినేషన్లు ఉపసంహరించించేదుకు ప్రయత్నాలు ప్రారంభించారు.


చిక్కాల రామారావుకు చిక్కులు.. ప్రతాప రామకృష్ణకు తలనొప్పులు

బీఆర్ఎస్ సీనియర్ నేత, సెస్ మాజీ చైర్మన్ మరోసారి సెస్ ఎన్నికల్లో తన ఆదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ముందుకు వచ్చాడు. మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో తంగళ్లపల్లి సెస్ డైరక్టర్ గా గెలిచి.. సెస్ చైర్మన్ పదవి చేపట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చిక్కాల రామారావు కు వ్యతిరేఖంగా సొంత పార్టీ వారే నామినేషన్లు వేసి ఫోన్ స్వీచాఫ్ చేసుకుని వెళ్లిపోవడంతో చిక్కాలకు చిక్కులు ఎదురైనట్లు అవుతుంది. సిరిసిల్ల మాజీ ఎంపీపీ దడిగెల కమలభాయి కుమారుడు బీఆర్ఎస్ యువనేత దడిగెల శ్రవణ్రావ్ చిక్కాల రామారావుకు వ్యతిరేఖంగా తంగళ్లపల్లి డైరక్టర్ స్థానానికి నామినేషన్ వేశారు. దీనికి తోడు తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ మహిళ మండలాధ్యక్షురాలు మోర నిర్మల సైతం పార్టీలో అసంతృప్తికిలోనై..బీఆర్ఎస్ నాయకుల తీరును నిరసిస్తూ గురువారం నామినేషన్ వేశారు. 12 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తూ వస్తున్నానని బీసీ మహిళగా తనకు అవకాశం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేస్తుంది. తంగళ్లపల్లి మండలంలో మంచి పరిచయాలు, యూత్ క్యాడర్ ను సంపాదించుకున్న దడిగెల శ్రవణ్రావ్ సైతం టీఆర్ఎస్ రెబల్ గా తంగళ్లపల్లి డైరక్టర్ స్థానంకు పోటీ చేస్తుండటంతో చిక్కాల రామారావుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు అందుబాటులో లేకుండా శ్రవణ్ రావ్ ఫోన్ స్వీఛాప్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక్కడే ఆర్థికంగా బలమైన వ్యక్తి, పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న రియల్టర్ దుబ్బాక రమేశ్ తన తండ్రి మల్లయ్యను బరిలో ఉంచాడు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడికి తలనొప్పులు

బీజేపీ పార్టీలో సైతం రెబల్స్ బెడదతో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణకు రాజకీయ తలనొప్పులు ఏర్పాడుతున్నాయి. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో బీజేపీ నేతల రెండు గ్రూపులుగా విడిపోయి నామినేషన్లు వేశారు. ఇప్పటికీ ఈ మండలాల్లో తమ అభ్యర్థులను బీజేపీ ప్రకటించలేదు. ఎవరి పేరు ప్రకటిస్తే ఎవరికి కోపం వస్తుందో అని తర్జన భర్జన పడుతున్నారు. బోయినిపల్లి మండల బీజేపీ నేత కనకయ్య చందుర్తిలో నామినేషన్ వేసి విందు రాజకీయాలు ప్రారంభించారు. ఇక్కడ బీఆర్ఎస్ నేత సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో జాయిన్ చేసి మరి ప్రకటించగా.. రెబల్స్ గా కనకయ్య నామినేషన్ వేయడంతో బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనా సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో రెబల్స్ ను బుజ్జగించేందుకు ఆయా పార్టీల నాయకులు బుజ్జగింపు పర్వంను ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed