పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా ఎస్పీ

by Disha Web Desk 23 |
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా ఎస్పీ
X

దిశ, జగిత్యాల టౌన్ : పెండింగ్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించడం తో పాటుగా వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నేర విచారణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టెక్నాలజీని వినియోగించాలన్నారు. పిఎస్ లలో నమోదు అయ్యే కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పొందుపరచాలని డీఎస్పీ లు, సీఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంబంధించిన సూచనలు ఇవ్వాలని సూచించారు.

ప్రతి స్టేషన్ పరిధిలో రెగ్యులర్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయాలని ఓపెన్ డ్రింకింగ్ వంటి వాటిని నిర్మూలించాలని అన్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ గుర్తించి ఆయా శాఖల సమన్వయంతో ప్రమాదాలను నియంత్రించాలని తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నివారణ తో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు. యువత గంజాయి భారిన పడకుండా విరివిగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

మరోవైపు జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో రాబోవు లోక్ సభ ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్క అధికారి ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్ పోస్టు ల నిర్వహణ ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ , డీఎస్పీలు రఘు చందర్, ఉమామహేశ్వర రావు, రంగా రెడ్డి,డీసీ ఆర్బీ ,సీసీఎస్ ,ఎస్బి , ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ,నాగేశ్వర రావు, రఫీక్ ఖాన్, సి.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.


Next Story