SP Akhil : Mahajan సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే

by Aamani |
SP Akhil : Mahajan సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 16 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ తగాదాలు, ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed