- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యుడికేమో థర్డ్ డిగ్రీ.. కవితకేమో రాజమర్యాదలతో విచారణేంటి?
దిశ, శంకరపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సామాన్యుడు నేరం చేస్తే పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి విచారణ చేస్తున్నారు. తెలంగాణలో మద్యం కుంభకోణంలో రూ. 100 కోట్ల ఆరోపణ ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె ఎమ్మెల్సీ కవితను రాజ మర్యాదలతో తన ఇంట్లో విచారించడం రాజ్యాంగ విరుద్ధమంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు. శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర శంకరపట్నం మండలానికి చేరుకుంది. ఆయనకు జిల్లా మండల నాయకులు ఘన స్వాగతం పలికి, తాడికల్, వంకాయ గూడెం, కేశవపట్నం, మక్త గ్రామాల్లో యాత్ర చేపట్టి మక్త గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి, ఇద్దరు చిన్నారులకు నామకరణం చేసి, ఓ చిన్నారికి అక్షరాభ్యాసం చేశారు.
అనంతరం కేశవపట్నంలోని మజీద్ కమిటీ సభ్యులను, ముస్లిం సోదరులను మర్యాదపూర్వక కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటుందని, సీబీఐ దర్యాప్తు బృందం విచారణ నోటీసులను అందజేసి, ఎమ్మెల్సీ కవిత ఇష్టం మేరకు తన ఇంట్లోనే విచారణ చేయడం చట్ట విరుద్ధమని, చిన్నాచితక నేరాలు చేసిన పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన బహుజనులను, పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి విచారణ చేస్తున్న సమాజంలో, ముఖ్యమంత్రి కుమార్తె ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణం విచారణ చేస్తున్న సీబీఐ బృందం విచారణ చాలా బాధాకరమని, తెలంగాణలో రూ. వేల కోట్లు సంపాదించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం నుండి కేంద్రముకు టీఆర్ఎస్ గా వెళుతుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దోబూచులాటాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన ప్రతి పేద బహుజన తల్లిదండ్రులు నాటి నుండి నేటి వరకు కూలీలు గానే మిగిలిపోయారని, కూలీల బిడ్డలు నేడు యజమానులు కావాలన్న లక్ష్యంతో, జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ రిజర్వేషన్ పెంచాలని, తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ తెలంగాణలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టి 1150 గ్రామాల్లో 18 వేల కిలోమీటర్లు 145 రోజులు అవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో దేశంలో బహుజన సమాజ్ పార్టీకి దిన దినము ఆదరణ పెరుగుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గం అధ్యక్షులు బోనగిరి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జక్కని సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మండల కన్వీనర్లు భాస్కర్, సంపత్, చందు, స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షులు మాతంగి మారుతి, ప్రచార కార్యదర్శి మాతంగి శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొయ్యడ సమ్మయ్య, మాతంగి అశోక్, అనిల్ కుమార్ మహిళా నాయకురాలు శిరీష, స్వరూపతోపాటు రాష్ట్ర, జిల్లా, మండల, వివిధ గ్రామాల కన్వీనర్లతోపాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read....